జ‌గ‌న్‌కు ఏపీ సిట్‌పై న‌మ్మ‌కం లేదా?

Saturday, October 27th, 2018, 03:24:55 PM IST

ఏపీ ప్ర‌తి ప‌క్ష నేత, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై వైజాగ్ విమానాశ్ర‌యంలో శ్రీ‌నివాస‌రెడ్డి అనే యువ‌కుడు
కోడిపందాల‌కు వాడే క‌త్తితో దాడిచేసి గాయ‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సంఘ‌ట‌న ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. దీనిపై ఏపీ డీపీపీ వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రించ‌డం, ఏపీ ముఖ్య‌మంత్రి, మంత్రి వ‌ర్గం కావాల‌నే చేయించుకుని దాన్ని త‌మ‌పై జ‌గ‌న్ రుద్దాల‌ని చూస్తున్నాడ‌ని మీడియా ముఖంగా వెల్ల‌డించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో చికిత్స‌పొందుతున్న జ‌గ‌న్‌ను విచారించ‌డానికి ఏపీ సిట్ అధికారులు ప్ర‌య‌త్నించారు. దీనికి జ‌గ‌న్ నుంచి ఎలాంటి స‌హ‌కారం అంద‌లేద‌ని తెలిసింది. విచార‌ణ విష‌యంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఏపీ డీజీపీ త‌న‌కు తోచిన‌ట్లు మాట్లాడ‌టం, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతున్న తీరు చూసిన త‌రువాత ఈ విచార‌ణ పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతుంద‌ని ఎలా న‌మ్మ‌మంటారు? మఈరు మీ డీజీపీ చెప్ప‌గ‌ల‌రో నాకు తెలియ‌దు కానీ నా అభిప్రాయం మాత్రం ఆయ‌న‌కు తెలియ‌జేయండి, ఏపీ ప్ర‌భుత్వ విచారణ మీద నాకు న‌మ్మ‌కం లేదు. అందుకే థ‌ర్డ్ పార్టీ విచార‌ణ కోరుతున్నాం` అని జ‌గ‌న్ డైరెక్ట్‌గా సిట్ అధికారుల‌కే చెప్ప‌డం రాజ‌కీయ దుమారాన్ని రేపుతోంది.

అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో రాష్ట్ర‌ప‌తిని క‌లుస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి ప్ర‌క‌టించ‌డం కొత్త అనుమానాల‌కు తావిస్తోంది. జ‌గ‌న్‌ను హ‌త్య చేయించాల‌న్న ప‌న్నాగంలో భాగంగానే ఈ హ‌త్యా య‌త్నం జ‌రిగింద‌ని, దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ అవ‌స‌రం అని, దీన్ని ఏపీ ప్ర‌భుత్వం కాకుండా మూడ‌వ పార్టీ (తెలంగాణ పోలీస్‌లైతే) అయితే అభ్యంత‌రం లేద‌ని, అప్పుడే నిజానిజాలు బ‌య‌టికి వ‌స్తాయి వైసీపీ శ్రేణులు ఖ‌రాకండీగా చెప్ప‌డం ఏపీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసింది.

  •  
  •  
  •  
  •  

Comments