పరిణితి లేనిదీ నాకు కాదు, మీకు మోడీగారు!

Sunday, July 29th, 2018, 09:31:04 AM IST

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ప్రస్తుతం రాజకీయాలు ఢిల్లీ స్థాయిలో వేడెక్కుతున్నాయి. మోడీ గారి నియంతృత్వ విధానాలు, ప్రాంతీయ పార్టీలను తొక్కిపట్టే ధోరణితో రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి దేశంలోని చాలా చోట్ల ఓటమి తప్పదని, నిన్న ఒంగోలు లో జరిగిన ధర్మ పోరాట దీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో విడగొట్టబడ్డ ఏపీని అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పి ఇప్పుడేమో అసత్యమాడుతూ ప్రజల మెప్పు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు మాట్లాడుతుంటే బీజేపీ నేతల నోట మాట రావడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని అడుగుతుంటే మీరు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. హోదా అప్పుడే ఇచ్చివుంటే ఇప్పటికే రాష్ట్రంలోని చాల రంగాలు కొంతవరకైనా అభివృద్ధి బాటపట్టేవాని న్నారు. వాస్తవానికి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తమ పార్టీ అని, నేను ముఖ్యమంత్రి గా వున్నపుడే ఐటి పరిశ్రమ సహా పలు పరిశ్రమలను అక్కడకు తీసుకువచ్చానని, ఈరోజున హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతిని పొందిందంటే ఆ క్రెడిట్ కి కారణం మా పార్టీ యేనని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని విడగొట్టినపుడు హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ వారికి ఇస్తామంటే మేము ఏ మాత్రం అడ్డుచెప్పకుండా అందరం ఒప్పుకోవడమే తప్పా అని అన్నారు. మా మంచితనాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, కేసీఆర్ మీ లా కాదు పరిణితి చెందిన వ్యక్తిలా మాట్లాడుతుంటే, మీకు మాత్రం పరిణితి లేదంటూ ఎద్దేవా చేయడం ఎంతవరకు సబబని అన్నారు. వాస్తవానికి పరిణితి లేనిదీ నాకు కాదు, మీకు అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హోదా కోసం చేస్తున్న ఈ ఉద్యమాలతో కేంద్రం కళ్ళు తెరుచుకోవాలని, ఏపీ ప్రజల గుండె చప్పుడు ఢిల్లీకి విపడాలని అన్నారు. రాష్ట్రం కోసం అవసరమైతే ఎవరినైనా ఎదిరిస్తానని ఆనాడే చెప్పానని, అందుకు సిద్ధమయ్యే ఈ నాడు పోరాటాలకు ఏ మాత్రం భయపడకుండా దిగుతున్నానని అన్నారు. మీరెన్ని కుట్రలు పన్ని మా పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నించినా ఏపీ ప్రజలకు తమ పార్టీ అంటే ఏంటో తెలుసునని రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకే మళ్ళి పట్టం కడతారని అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments