“ఇన్ని రోజులు మీకు అవినీతి కనిపించలేదా”… పవన్ పై విమర్శలు

Thursday, December 6th, 2018, 11:00:45 PM IST

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ గారు పార్టీ కార్యాలయంలో మన భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన సురేష్ గారు పవన్, చంద్రబాబు లపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. టీడీపీ పాలనలో ఇప్పటి వారికి కూడా దళితులకు అన్యాయం జరుగుతూనే ఉంది, ఇక్కడ ప్రభుత్వం అసలు దళితులని పట్టించుకోవడం లేదని అన్నారు. లంచాలకు ఆశపడి ఇక్కడ అంబెడ్కర్ స్మృతివనం ప్రాజెక్టుని ఆపేశారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. దళితులపై దాడుల్లో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని సురేష్‌ ఆరోపించారు. పవన్ ఈ మధ్య మా మీద బాగానే విమర్శలు చేస్తున్నాడు కానీ చంద్రబాబు చేసే అవినీతి కనిపించడం లేదా, ఈ నాలుగున్నర ఏళ్ళనుండి పవన్ కళ్యాణ్ నిద్రపోయి ఉన్నారా ఏందీ అని ఎద్దేవా చేశారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీపై పవన్‌ విమర్శలు చేయడం కరెక్టు కాదని చెప్పారు. అందరు ఏకమై ప్రజలని మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో ఉన్న ఫిరాయింపుదారులను ఓడించండి అని వెంకయ్య చెప్పగలరా అని ప్రశ్నించారు. అప్ ప్రజలని పట్టించుకోని చంద్రబాబు గారు తెలంగాణా ప్రజల బాగు కోసం అక్కడికి వెళ్లాడా అని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజల సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని సురేష్‌ మండిపడ్డారు. చంద్రబాబు పతనం దగ్గర్లోనే ఉందని, చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని తెలిపారు.