మీరు ఏదైనా పెద్దాసుపత్రిలో చూపించుకోండి : చంద్రబాబును ఉద్దేశించి ముద్రగడ

Sunday, April 29th, 2018, 01:57:25 PM IST

ఆ మధ్య కాపులను బిసిల్లో చేర్చాలని దీక్ష చేసి చంద్రబాబునాయుడుకు ముచ్చెమటలు పట్టించిన ముద్రగడ, మళ్లి ఆయనకు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరొక సారి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. చంద్రబాబు ముందస్తు ఎన్నికలు రాకపోతే మీ మీ పదవి ముగిసిన అధ్యాయం అంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మొదట్లో ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరుస్తారు అనే ఒప్పందం పై కేంద్ర ఎండిలోని బిజెపితో పొత్తుపెట్టుకున్న ఆయన ఆతరువాత హోదాతో వచ్చే లాభాలకంటే మరిన్ని లాభాలు ప్రత్యేక ప్యాకేజ్ తో వస్తాయని ప్యాకేజ్ కి ఒప్పుకున్నా విషయం తెలిసిందే.

అయితే మళ్ళి ప్రస్తుతం ప్రతిపక్షాలు హోదా ఉద్యమం లేవనెత్తడంతో భయపడి వణికిపోయిన చంద్రబాబు అదే నినాదంతో దీక్షలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఓ వైపు ఆయన ప్రభుత్వంలో 2023 వరకు మద్యం షాపుల లైసెన్సులను రెన్యువల్ చేయిస్తున్నారని వాదన వినిపిస్తోందని, దీనివల్ల మీకు వ్యక్తిగతంగా గాని, అలానే మీ పార్టీకి కానీ చేకూరే లాభమెంతో తెలిపాలని ప్రశ్నించారు.ఒక వేళా వచ్చే ఎన్నికల్లో గెలిచినా పార్టీ మద్యనిషేధాన్ని అమలు చేస్తే అప్పుడు మద్యం దుకాణ దారుల పరిస్థితి ఊహించలేనంత దారుణంగా తయారవుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో బాబుకు పార్టీ ఓడిపోయి పదవి పోతుందేమో అనే భయం పట్టుకుందన్నారు.

దీక్షలపేరుతో మీరు చేస్తున్న, ఆడుతున్న నాటకాలు అపూర్వం అని ఎద్దేవా చేసారు. ముందస్తు ఎన్నికలు రాకపోతే మీ పదవి ముగిసిన ఒక అధ్యాయం లాంటిదని, మీ పార్టీ రూలింగ్ గడువు పూర్తయ్యే సమయంలో కాలపరిమితితో కూడిన నామినేటెడ్ పదవులు ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ ఈవిధంగా స్థిరత్వం కోల్పోయి నిర్ణయాలు తీసుకుంటున్నారు, కావున మీరు ఏదైనా పెద్దాసుపత్రిలో చూపించుకుంటే బాగుంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments