మన దేశం లో ఎంత మంది యూట్యూబ్ చూస్తారో తెలిస్తే షాక్ !

Saturday, March 24th, 2018, 06:22:21 PM IST

నిజం చెప్పాలంటే ప్రస్తుతం జేబులో పెన్ లేని వారు కనపడతారేమో కానీ చేతిలో మొబైల్ ఫోన్ లేని వారు మాత్రం చాలా చాలా అరుదుగా కనపడుతుంటారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఎకో ఫ్రెండ్లీ గా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడమే. అందునా మొబైల్ ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోకి రావడం, అలానే రిలయన్స్ జియో ప్రవేశం తో ఆకాశం లో వున్న ఇంటర్నెట్ ధరలు ఒక్కసారిగా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చాయి.

ఇన్ని కారణాల చేత ప్రస్తుతం మొబైల్ మన జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది. అయితే ఇంటర్నెట్ వాడకం పెరిగాక చిన్న పెద్ద అని తేడాలేకుండా యూట్యూబ్ లో సినిమాలు, పలురకాల వీడియోలు చూడడం కూడా పెరిగింది. ప్రస్తుతం యూట్యూబ్‌ను భారత్‌లోకి తీసుకొచ్చి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ‘బ్రాండ్‌కాస్ట్‌ 2018’ పేరుతో యూట్యూబ్ వారు ఓ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా యూట్యూబ్‌ భారత్‌లో ఎలా వేగంగా విస్తరించిందో గూగుల్‌ ఇండియా వివరించి, ఓ కార్యక్రమంలో వెల్లడించింది. భారత ఇంటర్నెట్‌ యూజర్లలో 80శాతం మంది యూట్యూబ్‌ను వాడుతున్నారని పేర్కొంది. ‘2014లో యూట్యూబ్‌లో 16 ఛానళ్లు మాత్రమే ఉండేవి.

కానీ ఇప్పుడు 300లకు పైగా ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి 10లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వినియోగదారులకు మరిన్ని విభిన్నమైన ఫీచర్లు అందించేందుకు మేం మరింత విస్తృతంగా పనిచేస్తాం’ అని యూట్యూబ్‌ ఛీప్‌ బిజినెస్‌ అధికారి రాబర్ట్‌ కిన్సెల్‌ తెలిపారు. యూట్యూబ్‌ను 2008లో భారత్‌లో విడుదల చేశారు. ఒక్క మొబైల్‌ ఫోన్లలోనే యూట్యూబ్‌కు 22.5కోట్ల మంది నెలవారీ యాక్టివ్‌ యూజర్లున్నారు….