నువ్వు జన్మలో ముఖ్యమంత్రి కాలేవు జగన్ : తేదేపా ఎమ్మెల్యే

Thursday, September 6th, 2018, 03:27:47 PM IST

తెలుగుదేశం పార్టీకి సంబందించిన ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం ఆపుకోవాలి అని ఇదే వైఖరి మానుకోకపోతే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని ద్వజమెత్తారు. 2019 లో వచ్చే ఎన్నికల్లో ఈ సారి మీ పార్టీ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలిపారు.

జగన్ మొత్తం జాతకం కోర్టు లో ఉందని, తనపై ఆరోపణలు చెయ్యడం మంచిది తగదని, చేతనైతే వాటిని నిరూపించాలని తెలిపారు. సభాముఖం గా నా ఆస్తులు నేను ప్రకటిస్తాను నువ్వు నీ ఆస్తులని అలా ప్రకటించగలవా..? అని అడిగారు. జగన్ స్వార్ధ రాజకీయాల కోసం చాలా మంది అమాయకులు బలి అయ్యారని, ఇక నుంచి ఐనా తన పంథా మార్చుకోకపోతే ఇక జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవని తెలిపారు. ప్రతి దానికి తెలుగుదేశం పార్టీ ని విమర్శించడం కరెక్ట్ కాదని ఈ రోజు అమరావతలో జరిగిన ఒక మీటింగులో తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments