సీన్ రివర్స్ : ఫొటోలతో ఫెస్ బుక్ లేడి బెదిరింపులు!

Wednesday, September 19th, 2018, 12:03:37 PM IST

సోషల్ మీడియా వల్ల లాభాలు ఎంత ఉన్నాయో గాని వాటి వాళ్ళ జరిగే నష్టాలు లెక్కలేనివి. తెలియక చేసిన పొరపాట్లకు కొందరు తీరని నష్టాన్ని చూస్తున్నారు. ఇటీవల ఒక యువకుడి అశ్లిల ఫొటోలతో యువతీ బ్లాక్ మెయిల్ చేయాలనీ చూసింది. సాధారణంగా మహిళలు ఇలాంటి విషయాల్లో ఎక్కువగా మోసపోతుంటారు. కానీ కొందరు మహిళలు మగాళ్లను సోషల్ మీడియా ద్వారా ఆకర్షించి రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. రీసెంట్ గా గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన సోషల్ మీడియా బెదిరింపులు అందరిని షాక్ కి గురి చేశాయి.

స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ ఉమామహేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.23 సంవత్సరాల ఓ యువకుడు ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల ఫెస్ బుక్ లో అతనికి ఒక మహిళ పరిచయమైంది. నేను సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ను. నాకు ఒక పాప కూడా ఉంది. భర్త హైదరాబాద్ కంపెనీలో పనిచేస్తుంటాడు అని సదరు మహిళ యువకుడికి మాయమాటలు చెప్పి నమ్మించింది. అయితే వారి చాటింగ్ కొన్ని రోజులకే దారి తప్పింది. యువతీ ఎకౌంట్ నుంచి ఒక అశ్లిల ఫొటో పంపుతూ.. నువ్వు కూడా అలానే పంపాలని షరతు విధించింది. దీంతో యువకుడు ఆ విధంగా కొన్ని పోటోలను పంపడంతో చివరికి బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. వెంటనే అడిగిన డబ్బు ఇవ్వకుంటే పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటూ మహిళ బెదిరించడం స్టార్ట్ చేసింది. వేరే దారిలేక యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.