రియల్ లైఫ్ లో రాజు గారి గది 2 సిన్ రిపీట్ అయ్యింది.. కానీ

Thursday, October 19th, 2017, 01:00:47 PM IST

చాలా వరకు ఈ రోజుల్లో ప్రతి ఒకరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీని వల్ల ఎంత లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలూ కూడా ఉన్నాయని కొన్ని సంఘటనలను చూస్తే మనకే అర్ధమవుతోంది. ముఖ్యంగా యువతలో సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. కొన్ని సార్లు అవి తప్పటడుగులు కూడా వేయిస్తున్నాయి. మహిళలు నగ్న దృశ్యాలను చిత్రీకరించి విడియోలను కొన్ని అశ్లిల వెబ్ సైట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల రాజు గారి 2 సినిమాలో కూడా ఈ పాయింట్ లో వచ్చిన చిత్రమే. అమ్మాయిలపై అలాంటి దారుణమైన ఆలోచనతో ఉంటె వారై జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఆ సినిమా చూస్తే మనకే అర్ధమవుతుంది. అ

యితే రీసెంట్ గా ఇదే తరహాలో ఒక యువకుడు తన సెల్ ఫోన్ తో ఒక మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయాలని ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబై నగరంలో 30 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి చించ్ పోక్లీ ప్రాంతంలోని ఓ ఇంట్లో నివాసముంటోంది. అయితే కైలాస్ యాదవ్ (20) అనే కుర్రాడు వారి ఇంట్లో ఏడాదిన్నర పాటు పనిచేస్తూ ఉంటున్నాడు. అయితే యజమానురాలు స్నానం చేయడానికి వెళ్లడం గమనించిన అతను తన సెల్ ఫోన్ తో ఆమెను నగ్నంగా వీడియో తీయడానికి ప్రయత్నించాడు. కానీ యజమానురాలు అతన్ని గమనించి వెంటనే కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఐపీసీ 354 కింద కేసు నమోదు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments