గోదావరిలో దూకిన యువజంట….మ్యాటర్ ఏంటంటే!

Sunday, May 13th, 2018, 04:57:55 PM IST

నేడు యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఇంట్లో పెద్దలకు తెలిసి మందలిస్తే కొందరు నిండు నూరేళ్ళ జీవితాన్ని ఆత్మహత్య చేసుకుని నాశనం చేసుకుంటున్నారు. ప్రేమపెళ్లికి తమ తల్లితండ్రులు ఒప్పుకోలేదని, ఒక యువజంట గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో శివదుర్గ అనే యువకుడు ఎలెక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. కాగా అదే గ్రామంలో పెదపాట్నం గ్రామానికి చెందిన నాగ సుజిత వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఉంటూ 9వ తరగతి చదువుకుంటోంది.

కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య పరిచయం కలగడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది. అయితే వీరి ప్రేమ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు, పెళ్లి లేదు ఏమి లేదు అని వారిని మందలించారు. కాగా ఒకరోజు బయటకి వెళ్తున్నాను అని చెప్పి సుజిత సైకిల్ పై స్థానిక గోదావరి ఒడ్డున వున్న వైనతేయ వారధి వద్దకు వెళ్ళింది, అప్పటికే బైక్ పై అక్కడికి వచ్చిన శివ దుర్గ హఠాత్తుగా సుజితతో కలిసి ఒక్కసారిగా నదిలోదూకాడు. ఆ ఘటనను గమనించిన అక్కడివారు, శివదుర్గ బైక్ లో వున్న సెల్ ఫోన్ తో వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు.

విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఇరు కుటుంబాల పెద్దలు స్థానిక గజఈతగాళ్లను రప్పించి వెతికించగా శివదుర్గ మృతదేహం నీళ్లలో దొరికింది. అయితే సుజిత మృత దేహం కోసం మాత్రం ఇంకా గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఈ ఘటన విషయమై సమాచారం అందుకున్న స్థానిక ఎస్ ఐ ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, శివ దుర్గ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ యువజంట ఆత్మహత్యతో వారి తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి………

  •  
  •  
  •  
  •  

Comments