వైరల్ వీడియో : రేసులో యువకుడి దుర్మరణం!

Wednesday, September 5th, 2018, 03:54:42 PM IST

కర్ణాటకలో అందరూ చూస్తుండగానే దారుణం చోటు చేసుకుంది. ఆనందంగా ప్రారంభమైన పోటీలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రధాన నగరం హుబ్లీలో గుర్రపు బండి పోటీల్లో యువకుడు కిందపడి మృతి చెందాడు. స్థానిక బసవేశ్వర ఆలయ ఆధ్వర్యంలో గుర్రపు బండ్లను ఘనంగా నిర్వహించారు. ముందు రోజు నుంచే యువకులు ఈ పోటీల కోసం ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతా సవ్యంగానే ఉందన్న తరుణంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.

రేసులో పాల్గొన్న ఒక యువకుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ప్రమాదంలో అతని తలకు బలంగా గాయాలయ్యాయి. సమీపాన ఉన్న జనాలు ఆ వ్యక్తిని కాపాడాలని అనుకున్నఒప్పటికీ అవకాశం దొరకలేదు. అప్పటికే బైకులు కూడా చాలా వేగంగా రావడంతో నిమిషాల్లోనే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ పోటీల నిర్వహించే ముందు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments