నగరంలో సేల్ఫీ సూసైడ్ కలకలం

Friday, May 18th, 2018, 01:31:07 AM IST

ఈ రోజుల్లో మనుషులకు ప్రాణాల మీద విలువ, జీవితం మీద భయం లేకుండా పోతుంది. ప్రతీ చిన్న సమస్యకి ప్రాణం తీస్కోవడం ఒకటే పరిష్కారం అయిపొయింది. సమస్య ఏదైనా పరిష్కరించుకునే దారి చూడకుండా చావునే ఎంచుకుంటున్నారు. అందులో యూత్ ఇంకా మరీ దారుణంగా తయారవుతున్నారు. అవును ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ప్రాణాలు తీసుకున్నాడు ఈ అబ్బాయి. అసలు విషయంలోకి వెళితే ఘటకేసర్ మండలం అన్నోజీ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి రిలయిన్స్ మార్కెట్ లో మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ గా ఉద్యోగం చేస్తున్నాడు.అయితే ఈ బ్వ్యక్తి మాత్రం ఆఫీస్ తన గ్రామానికి దూరం కావడం వలన హైదరాబాద్ నగరం లోని సరూర్ నగర్ జీహెచ్ఎం సి కార్యాలయం సమీప ప్రాంతంలో నివసిస్తున్నాడు.

ఎప్పటిలాగానే రోజూ ఆఫీస్ కు వెళ్లి వచ్చే ఈ వ్యక్తి బుదవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఉరి వేసుకొని చనిపోయాడు. ఇంటి యజమానుల ద్వారా స్సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని దగ్గరలోని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమాట్రం నిమిత్తం పంపించారు. ప్రస్తుతానికి మెడికల్ రిపోర్టులు రాకపోగా పోలీసులు మాత్రం మానసిక బాధతో డిప్రెషన్ కి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments