RRR..మొన్న చరణ్ వంతు..ఇప్పుడు తారక్ వంతు.!

Tuesday, February 12th, 2019, 08:28:41 AM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రదారులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR.ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు యావత్తు భారతదేశంలోనే భారీ ప్రాజెక్టులలోనే ఒక చిత్రంగా ఈ సినిమా కూడా ఉంది.అయిత్ ఈ సినిమా కోసం మొన్ననే కొన్ని షూటింగ్ స్పాట్ ఫొటోలతో పాటు రామ్ చరణ్ పాత్ర కోసం కూడా కొంత సమాచారం బయటకి వచ్చింది.దానితో ఇప్పటికి చరణ్ వంతు పూర్తయ్యింది.ఇప్పుడు తారక్ వంతు వచ్చింది.

ఈ ఇద్దరూ మాస్ హీరోలే..అలాంటిది ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు,అందుకోసమే ఈ సినిమా కోసం తారక్ కూడా గట్టిగానే కష్టపడుతున్నారట.ఈ సినిమా కోసం తారక్ మరోసారి చొక్కా విప్పబోతున్నారని సమాచారం.ఎన్టీఆర్ ఈ సినిమాలో మరో సారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం.ఇప్పటికే తారక్ అరవింద సమేత లో చేసిన 6 ప్యాక్ బాడీతో ఫైట్ సీన్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.ఇప్పుడు ఈ సినిమాలో కూడా మరోసారి అలాంటి ఫైట్ సీన్ చేస్తున్నారని తెలుస్తుంది.మరి ఈ సినిమాలో తారక్ ఎలాంటి భీబత్సం సృష్టిస్తారో వేచి చూడాలి.