పవన్ ను కలిసేవరకు వెళ్ళను..గేటుదగ్గరే కూర్చున్న యువతి..!

Thursday, September 29th, 2016, 01:30:24 PM IST

pich
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవాలని ఓ యువతీ ఆయన ఇంటి ముంది హల్ చల్ చేసింది.పవన్ తో తన కష్టాలు చెప్పుకోవాలని సిబ్బందిని కోరింది.కానీ అందుకు పవన్ కళ్యాణ్ సిబ్బంది నిరాకరించారు.

కొండాపూర్ కు చెందిన జ్యోతి అనే మహిళ నెలరోజులుగా పవన్ ఇంటికి వస్తూ పోతూ ఉంది. పవన్ కళ్యాణ్ సిబ్బంది సార్ లేరని చెప్పి ఆమెని తిరిగి పంపిస్తూ వచ్చారు. బుధవారం కూడా పవన్ ను కలిసేందుకు ఆమె ఇంటివద్దకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు కనీసం తనకి 10 నిమిషాల సమయం ఇవ్వాలని, తన కష్టాలు పవన్ కళ్యాణ్ కు చెప్పుకోవాలని వేడుకుంది. కానీ పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని షూటింగ్ కు వెళ్లారని సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు.తాను పవన్ కళ్యాణ్ ను కలిసేవరకూ వెళ్లనని ఆ మహిళ పవన్ ఇంటి ముందు గేటు వద్దే కూర్చుంది.ఆమె మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది, పీఏ పవన్ ను కలవనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. పవన్ కళ్యాణ్ తనని కష్టాలనుంచి బయట పడేస్తారన్న ఆశతో వచ్చినట్లు తెలిపింది.పవన్ కళ్యాణ్ సిబ్బంది ఎంత వారించినా వినకపోవడంతో చివరకు వారు పోలీస్ లకు ఫోన్ చేశారు. పోలీస్ లు వచ్చి ఆమెని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  •  
  •  
  •  
  •  

Comments