బస్సు లో యువకుడి బరితెగింపు!

Wednesday, February 14th, 2018, 02:30:28 AM IST

దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రస్తుత సమస్యల్లో మహిళల పై లైంగిక వేధింపులు ఒక ప్రధాన సమస్యగా మారిందనేది ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరవలసిన విషయం. ఏకంగా దేశరాజధాని దిల్లీలో బస్సు లో ప్రయాణిస్తున్న ఒక యువతి తన ప్రక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడి దుష్ప్రవర్తనకు నిర్ఘాంతపోయి ఆమె సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసింది. ఈ నెల 7న బాధితురాలు వసంత్‌ విహార్‌ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె పక్కనే కూర్చున్న ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేసినా తోటి ప్రయాణికులు స్పందించకపోవటంతో ఆ వ్యక్తి మరింతగా రెచ్చిపోయాడు. అయితే తనకు ఎదురైన ఇబ్బందులపై ఫిర్యాదులు చేయబోతే పోలీసుల ప్రతిస్పందన సరిగా ఉండటంలేదని దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆ విద్యార్థిని వాపోయారు.

అయితే మూడు రోజుల తర్వాత ఢీల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయబోగా కేసు నమోదుకువారు సుమారు ఆరు గంటలపాటు నిరీక్షించేలా చేశారని, ఘటన జరిగిన రోజే ఎందుకు రాలేదంటూ ప్రశ్నలు సంధించారని ఆమె వాపోయారు. వీడియో క్లిప్లో ఆ వ్యక్తి స్పష్టంగా కనిపించినప్పటికీ ఇంకా అతణ్ణి అరెస్టు చేయలేదని తెలిపారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బస్సుల్లో మహిళల రక్షణ కోసం మార్షల్స్ ఏర్పాటు మరియు సిసిటివి అమర్చడం వంటి హామీ ఇచారని, కానీ అవి ఆచరణలోకి రాలేదని అన్నారు. మహిళల పట్ల చూపుతున్న ఈ వివక్ష కు అడ్డుకట్ట వేసి, సమాజములో మహిళల పట్ల క్రూరమృగం కంటే దారుణంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుని స్త్రీకి రక్షణనివ్వాలాని ప్రజా సంఘాలు కోరుతున్నాయి…..

  •  
  •  
  •  
  •  

Comments