వైరల్ వీడియో : ప్రాణం తీసిన క్రికెట్

Saturday, January 27th, 2018, 02:02:23 PM IST

మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. తోటి మనిషి చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు అంటే ఈ ప్రపంచంలో ఎవరు నమ్మలేరు. కానీ చావు ఎంత బయంకరమైనదో అంతే ప్రశాంతమైనది అని ఇటీవల ఒక ఘటన నిరూపించింది. ఆటలో నిమగ్నమైన ఆటగాళ్లు అంతా చూస్తుండగానే బౌలింగ్ వేయాల్సిన యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొంచెం సేపటి వరకు బాగానే ఉన్నాడు కదా ఇలా పడిపోయారేంటి అని అంతా షాక్ అయ్యారు. తీవ్ర కలకలం సృష్టించిన ఆ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. జిహెచ్ఎంసీ అధికారికంగా నిర్వహిస్తోన్న బంగారు తెలంగాణ క్రికెట్ టౌర్నమెంట్ లు బంజారాహిల్స్ లో గ్రాండ్ గా జరుగుతున్నాయి. అయితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 జహీరా నగర్ లో జరుగుతున్న ఓ మ్యాచ్ లో అంథోని అనే యువకుడు బౌలింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతను హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అని నిర్దారించారు. బౌలింగ్ చేస్తోన్న సమయంలో బిపి లెవెల్స్ అసాధారణంగా పెరగడంతో చనిపోయాడని తెలిపారు.