నేటి యువ‌త‌.. కొంద‌రు డ్ర‌గ్స్ మ‌త్తులో ఏం చేశారో తెలుసా..?

Thursday, October 25th, 2018, 09:45:35 AM IST

డ్ర‌గ్స్ కొంత‌కాలం క్రితం టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌రో డ్ర‌గ్స్ మ‌త్తులో నేటి యువ‌త‌ చేసిన ర‌చ్చ హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపింది. తాజాగా హైద‌రాబ‌ద్ లోకి పాత‌బ‌స్తీలో అర్ధ‌రాత్రి డ్ర‌గ్స్ మ‌త్తులో కొంద‌రు యువ‌తీ యువ‌కులు క‌త్తుల‌తో, బ్లేడ్ల‌తో ప‌ర‌స్ప‌రం ఒక‌రి పై ఒక‌రు దాడులు చేసుకున్న సంఘ‌ట‌న అక్క‌డి స్థానికుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసింది.

ఇక ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన‌ అసలు మ్యాట‌ర్ ఏంటంటే రెండురోజుల క్రిత్రం హైద‌రాబాద్ ఫ‌ల‌క్ నామా ప్రాతంలోని కొంత‌మంది అమ్మాయిలు, అబ్బాయిలు డ్ర‌గ్స్ తీసుకున్నారు. అయితే డ్ర‌గ్స్ మోతాదు ఎక్కువ అవ‌డంతో తూగుతూ రోడ్ల పైకి వ‌చ్చారు. స్థానికులు చెప్పిన ప్ర‌కారం ఆ యువ‌తీ యువ‌కులు వారిలో వారే పెద్ద పెద్ద‌గా కేక‌లు వేసుకుంటూ.. గొడ‌వ‌లు ప‌డుతూ పెద్ద హంగామా క్రియేట్ చేశారు.

ఇక ఆ త‌ర్వాత గొడ‌వ ఎక్కువ కావ‌డంతో త‌మ వ‌ద్ద ఉన్న బ్లేడ్లు,క‌త్తుల‌తో ఒక‌రి పై ఒక‌రు దాడలు చేసుకున్నారు. ఇక వారిలో ఒక యువ‌తి అయితే మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితిలో త‌న పై తానే దాడి చేసుకుని త‌న చేతి మ‌ణిక‌ట్టును కోసుకుంది. దీంతో స్థానికులు పోలీసుల‌కు సమాచారం అందించ‌గా వారు వ‌చ్చి ఆ యువ‌తీ యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయ‌ప‌డిన యువ‌తిని చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. ఏది ఏమైనా నేటి యువ‌తలో కొంద‌రు మ‌త్తుకు భానిస అయ్యి త‌మ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నార‌ని స‌ర్వత్రా చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments