వై ఎస్ జగన్ 50 రోజుల శ్రీకాకుళం టూర్ టీడీపీ కి గట్టి దెబ్బేనా..?

Thursday, October 25th, 2018, 01:00:56 AM IST

శ్రీకాకుళం జిల్లాని “తిత్లి” తుఫాను ఎంత అతలాకుతలం చేసేసిందో అందరికి తెలుసు,ఇక్కడ అంత నష్టం జరిగినా సరే పవన్ మరియు జగన్ లు ఒక్క రోజు కూడా ఇక్కడికి రావడానికి కేటాయించుకోవడానికి నోచుకోలేదని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో వీరిద్దరి మీద విరుచుకుపడ్డారు,కట్ చేస్తే పవన్ తన కవాతు అంతరం శ్రీకాకుళంలో ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్న సమస్యలను మరింత లోతుగా విశ్లేషించి సరి కొత్త సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి తెలుగు తమ్ముళ్లకు షాకిచ్చారు.

అయితే పవన్ వంతు ఇప్పుడు అయిపొయింది,జగన్ కూడా టీడీపీ నేతలకు చంద్రబాబుకి కలిపి ఒకేసారి వార్నింగ్ కూడా ఇచ్చేసాడు.జగన్ అనే వ్యక్తి ఇంకో వారం రోజుల్లో శ్రీకాకుళం వస్తున్నాడు,అక్కడే 50 రోజుల పాటు ఉండి వారి యొక్క సమస్యలను వెలుగులోకి తీసుకొస్తాడు అని వారికి సవాలు విసిరారు.ఇప్పుడు జగన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీ నేతల పాలిట మరో తల నొప్పిగా తయారవ్వనుందా అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు.

ఇప్పటికే పవన్ అక్కడికి వెళ్లి పలు కొత్త రకాల సమస్యలను వెలుగు లోకి తీసుకువచ్చారని,ఇప్పుడు జగన్ ఏకంగా 50 రోజులు అక్కడే పర్యటిస్తానని ప్రకటించడంతో అక్కడకి జగన్ వెళ్తే మరికొన్ని కొత్త సమస్యలు వెలుగులోకి తెచ్చేందుకు ఆస్కారం ఉందని,అంటున్నారు.ఇప్పటికే పవన్ పలు వైఫల్యాలను ఎత్తి చూపడంతో టీడీపీ నేతల యొక్క బాధ్యతారాహిత్యం ప్రజలకి తెలిసింది.ఇప్పుడు జగన్ కూడా అక్కడకి వెళ్తే టీడీపీ నేతలని మరింత నీరు కారుస్తారని కచ్చితంగా టీడీపీ కి గట్టి దెబ్బే తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.