సీఎం చంద్రబాబుకి వై ఎస్ జగన్ బహిరంగ సవాల్..!

Tuesday, October 23rd, 2018, 03:00:58 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ప్రస్తుతం తన పాద యాత్రలో నిమగ్నమై ఉన్నారన్న సంగతి అందరికి తెలుసు.అయితే శ్రీకాకుళంకి దగ్గర ప్రాంతంలోనే ఉన్నా సరే ఎక్కడో ఉన్న కోర్టుకి ప్రతీ వారం వెళ్లి వచ్చే జగన్ కు ఇక్కడ టిట్లి తుఫాన్ వల్ల ఇంత నష్టం జరిగినపుడు ఒక్క రోజు కూడా కేటాయించుకోలేకపోయారా? అని తెలుగుదేశం నాయకులు జగన్ ను విమర్శించారు.అయితే తన మీద వస్తున్నటువంటి ఈ విమర్శలు అన్నిటిని తిప్పి కొడుతూ ఈ రోజు సాలూరు లో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్ టీడీపీ నేతలు అందరికి దిమ్మతిరిగిపోయే కౌంటర్లు ఇచ్చేసారు.

ఈ సభలో మాట్లాడుతూ తాను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు తనని శ్రీకాకుళం ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారన్న మాటలకు సమాధానంగా జగన్ అసలు అధికారంలో ఉన్నది నేనా నువ్వా? అని ప్రశ్నించారు.రాష్ట్రం యొక్క ఖజానా నీ దగ్గర ఉందా లేక నా దగ్గర ఉందా అని మండిపడ్డారు.అంతే కాకుండా ఇలాంటి దిక్కుమాలిన నాయకుడు మనల్ని పరిపాలిస్తున్నాడు అని వై ఎస్ జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అయితే ఇక్కడ టిట్లి తుఫాను వల్ల 3435 కోట్లు నష్టం వచ్చిందని చంద్రబాబే తెలిపారని,ఇప్పుడు ఆ 3435 కోట్లను కేవలం పది రోజుల్లో అక్కడి బాధితులు అందరికి అందేలా చెయ్యాలి అని జగన్ బహిరంగ సవాలు విసిరారు.ఒకవేళ అలా చెయ్యని పక్షంలో వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.