ఆటోవాలాగా మారిన జగన్!

Wednesday, May 16th, 2018, 07:30:43 PM IST

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం నిర్విరామంగా చేపట్టిన తన ప్రజాసంకల్ప యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నిజానికి జగన్ యాత్ర మొదలుపెట్టాక చిన్న, పెద్ద, ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతిఒక్కరు జగన్ వెంట పాదయాత్రకు తరలివస్తున్నారని వైసిపి శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఇప్పటికే యాత్ర జరుగుతుండగానే పలువురు ఇతర పార్టీల నేతలు అక్కడక్కడా వైసిపిలో చేరుతున్నారు. కాగా ఈ ప్రజాసంకల్ప యాత్ర వైసిపి శ్రేణుల్లోనూ, కార్యకర్తల్లోనూ నూతనోత్తేజాన్ని నింపుతోందని తెలుస్తోంది. ఇప్పటికే 2000 కిలోమీటర్లు మైలురాయిని పూర్తిచేసుకున్న ఆయన యాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోంది. కాగా నేడు ఆ జిల్లాలోని మేదినరావుపాలెంకు చేరుకున్న యాత్రలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది.

ఇటీవల ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఆటోడ్రైవర్ లను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, ఎంతో కష్టపడి రాత్రి, పగలు కష్టపడే ఆటో కార్మికులకు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తానని జగన్ చేసిన ప్రకటనకు నేడు ఆటోడ్రైవర్లు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఒక ఆటో సోదరుడు ఇచ్చిన ఖాకీ చొక్కావేసుకుని జగన్ కాసేపు సరదాగా ఆటో నడిపి అక్కడివారిని ఆనందపరిచారు. పేద, మద్యతరగతి ప్రజల అభ్యున్నతి తమకు ముఖ్యమని వారి అభివృద్ధికి పార్టీ అధికారంలోకి వచ్చాక మరిన్ని పధకాలు ప్రవేశపెట్టనున్నట్లు ఈ సందర్భంగా జగన్ తెలిపారు……

  •  
  •  
  •  
  •  

Comments