చంద్రబాబు మొహాన్ని చూసి ఎవరూ రారన్న వైఎస్ జగన్ !

Monday, November 7th, 2016, 08:53:27 AM IST

jagan
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అభ్యఖుడు వైఎస్ జగన్ నిన్న ఆదివారం విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ‘జై ఆంధ్రప్రేదేశ్’ పేరిట భారీ బహిరంగా సభ నిర్వహించారు. ఈ సభలో జగన్ అధికార పక్షాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రత్యేక హోదా కావాలని జనం అడుగుతుంటే అబ్బే దాని వలన ఎలాంటి ప్రయోజనం లేదని బాబుగారు అంటున్నారు. రాహ్స్త్ర నిధుల్లో 90% కేంద్రం ఇవ్వడం, 100 శాతం ఆదాయ పన్ను మినహాయింపు, 100 శాతం ఎక్సయిజ్ పన్ను మినహాయింపు, రవాణా సదుపాయాలు ఇవన్నీ ప్రత్యేక హోదా వలెనే వస్తాయి.

కానీ బాబు మాత్రం ఇవేమీ అక్కరలేదని అంటారు. కావాలని ఉద్యమాలు చేసేవాళ్ళ పై పిడి యాక్ట్ పెట్టి జైళ్లలో వేయిస్తారు. కావాలని బబంద్ రోజున బస్సులు ఆయనే నడిపిస్తారు ముందు ఆయనపై టాడా కేసు పెట్టాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారాశ్రామిక వేత్తలు ప్రత్యేకహోదా వలన వచ్చే ఇన్సెంటివ్స్ చూసే వస్తారు అంతేగాని చంద్రబాబు సుందరమైన మొహాన్ని చూసి ఎవరూ రారు అంటూ ప్రభుత్వంపై, చందరబాబుపై తీవ్ర స్థాయిలో వాగ్దాటి ప్రదర్శించారు.