వై ఎస్ జగన్ ఒక పచ్చి మోసగాడు.. ఆవేదనతో పితాని..!

Tuesday, September 11th, 2018, 04:04:14 PM IST

తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి జరిగిన చికిత్స నిమిత్తం వైద్యుల సలహా మేరకు తన ప్రజా పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసినదే.. అయితే పవన్ కళ్యాణ్ మెల్లగా కోలుకొని మళ్ళీ తన పార్టీ కార్యాచరణలో పడ్డారు. దానికి సంబందించే ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో ఒక చిన్నపాటి సభను ఏర్పాటు చేశారు. ఈ మీటింగుకు జనసేన పార్టీలోని ప్రముఖులుతో పాటు అక్కడి కొంత మంది జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు..

అయితే ఈ మీటింగుకి ముఖ్యులు అయినటువంటి పితాని బాలకృష్ణ గారు జనసేన పార్టీలో చేరారు. అప్పుడు వారు మాట్లాడుతూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం కొన్ని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. తనతో ఉన్న చుట్టూ పక్కల వారికి ఏదొక సేవ చెయ్యాలి అన్న సమయం లో “వై ఎస్ జగన్ తన మోసపూరిత మాటలతో తాను 8 ఏళ్ళుగా చేస్తున్న ఉద్యోగాన్ని కూడా మాన్పించి, తన పార్టీలో టికెట్ ఇస్తాను అని ప్రలోభ పెట్టి, టికెట్ ఇచ్చే 15 రోజుల ముందు వరకు గుండెల నుండే నువ్వే అన్న అని మాయ మాటలు చెప్పి టిక్కెట్టు వేరే వాళ్ళకి ఇచ్చేసారేనని తెలిసి ఇదెక్కడి న్యాయం అన్న అని అడిగితే నీకు పార్టీలో నచ్చితే ఉండు లేకపోతే పో అని మాట్లాడారని చెప్పారు”.

అంతే కాకుండా “మా వర్గం వారు అంత ఏకధాటిగా ఉన్నాం అన్నాఇక్కడ అంతా బాగానే ఉంది అంటే వై ఎస్ జగన్ తన నెత్తి మీద వెంట్రుకలు చూపించి ఏంటి కులం కులం అంటున్నావూ నేను సోనియాగాంధీనే లెక్క చెయ్యలేదు” అని అన్నారంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గపు ఆలోచనాపరుడో మీరు ఆలోచించాలి అని పేర్కొన్నారు. “విశ్వసనీయత, మాట తప్పడు, మడమ తిప్పడు” ఈ మాటలు అన్నీ ఆర్భాటం కోసమే అని లోపల అంతా దుర్మార్గం,కుట్ర,కుతంత్రం మాత్రమే ఉన్నాయని అని అంతే కాకుండా ఈ హత్తుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ మోసం అని ఎవరు నమ్మకండి అని తన ఆవేదనను వెళ్లగక్కుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments