జ‌గ‌న్‌తో ట‌చ్‌లో జాతీయ పార్టీలు.. అదే జ‌రిగితే సంచ‌ల‌న‌మే..!

Tuesday, April 16th, 2019, 12:40:18 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయాన్ని సాధించబోతోందని ఒక‌వైపు స‌ర్వేలు, మ‌రోవైపు రాజ‌కీయ‌విశ్లేషక‌లు త‌మ త‌మ అభిప్రాయాల‌ను వెళ్ళ‌డిస్తున్నారు. 120 పైగానే అసెంబ్లీ సీట్లు, 20 పార్ల‌మెంట్ సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించవచ్చని, ఏపీలో వైసీపీ ప్ర‌భంజ‌నం హైరేంజ్‌లో ఉంద‌ని రిజ‌ల్ట్స్ కూడా వైసీపీకి అనుకూలంగా వ‌స్తాయ‌ని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ నేత‌లు మ‌రోసారి తాము అధికారంలోకి వ‌స్తామ‌ని పైకి చెబుతున్నా.. వారిలో జోష్ మాత్రం క‌నిపించ‌డంలేదు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఈసారి వైసీపీకి చాన్స్ ఇవ్వాల‌ని ఫిక్స్ అయ్యార‌ని టీడీపీ నేత‌ల‌కు అర్ధ‌మైపోయింది. అందుకే ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత చంద్ర‌బాబుతో పాటు మ‌రో ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు మీడియా ముందుకు వ‌స్తున్నారు కానీ, మిగ‌తావారు మాత్రం కామ్ అయిపోయారు.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే జాతీయ రాజ‌కీయ స‌మావేశాల్లో ప్ర‌స్తుతం వైసీపీకి సంబంధించి చ‌ర్చ‌లు జోరుగా జరుగుతున్నాయి. ఇప్ప‌టికే వైసీపీకి 20 ఎంపీ స్థానాలు క‌న్ఫ‌ర్మ్ అని జాతీయ స‌ర్వ‌తేలు చెబుతున్నాయి. మ‌రోవైపు కేంద్రంలో ఏ పార్టీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి కావాల్సిన‌ మ్యాజిక్ ఫిగ‌ర్ వచ్చే అవ‌కాశం లేద‌ని సర్వేలు చెబుతున్నాయి.

దీంతో వైసీపీ జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో పోలింగ్ త‌ర్వాత అనేక మంది నేత‌లు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఫోన్లు చేసి మ‌రీ, జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల అయ్యాక జ‌గ‌న్ జాతీయ రాజ‌కీయాల్లో కూడా చక్రం తిప్పే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.