వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా..? జగన్ వ్యూహంలో బాబు పడతాడా?

Tuesday, September 11th, 2018, 01:37:24 PM IST

2014 నుంచి 2019 లోపు ఆంధ్ర,తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో చాలా మార్పులు సంభవించాయి. రోజు రోజుకి ఊహించని ఎత్తుగడలు సంచలన నిర్ణయాలు.. ఈ సారి ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లో ఏం జరగబోతుందో అని ఒక తీవ్ర ఉత్కంఠ, ఇప్పటికే తెలంగాణా లో ముందస్తు ఎన్నికలు అంటూ కెసిఆర్ పేల్చిన బాంబుకు ఒక్కొక్కరు తలలు పట్టుకుంటున్నారు సర్వత్రా ఎం జరగబోతుంది అన్న దాని మీద ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నట్టు ఆయన పార్టీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి గారు కూడా ఒక ఇరకాటంలో పడేసారు.

జగన్ యొక్క పాదయాత్ర విశాఖ జిల్లాకు చేరుకొని దాదాపు పూర్తి కావస్తున్న ఈ సందర్భంలో జగన్ ఇక్కడ తన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం కోసం ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కి పార్టీకి చెందిన మొత్తం 175 నియోజకవర్గ అభ్యర్థుల్ని హాజరు కావాలని సూచించారు, దానితో ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి హాజరు అయ్యినట్టు తెలుస్తున్నది. ఈ సమావేశం లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరు కలిసి మూకుమ్మడిగా రాజీనామా చేస్తారు అన్నట్టుగా విజయ సాయి రెడ్డి గారు చిన్నపాటి బాంబు వేశారు. ఒకవేళ అలా చేసినట్టయితే తెలంగాణలో జరిగినట్టుగా ముందస్తు ఎన్నికలు వచ్చేందుకు అవకాశం ఉంది అని ఇలా జరిగితే చంద్రబాబుకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అంతే కాకుండా ఈ సమావేశం లో రానున్నరోజుల్లో ఒక 100 రోజుల ప్రణాళిక ప్రకారం తమ పార్టీలోని సభ్యులు ఎమ్మెల్యేలు అభ్యర్థులు అందరు ప్రజల్లో ప్రతి నియోజిక వర్గం లో తిరగాలని వారి సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీస్తు వారి యొక్క నవరత్నాలు అనే అంశాన్ని బలంగా తీసుకెల్లాలి అన్నట్టుగా దిశా నిర్దేశం చేస్తారు అన్నారు తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం వై ఎస్ జగన్ తన నిర్ణయాన్ని వారి యొక్క ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారో లేదో అన్న అంశాన్ని ప్రకటిస్తారు అని తెలుస్తుంది..

  •  
  •  
  •  
  •  

Comments