అదో దిక్కుమాలిన ఆలోచన!

Wednesday, April 22nd, 2015, 12:27:17 PM IST

jaganmohanredday
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంద్ర పర్యటనలో భాగంగా బుధవారం విజయనగరంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో విమానాశ్రయం ఉండగా విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు దేనికని ఏపీ సర్కారును నిలదీశారు. అలాగే విశాఖలో ఎయిర్ పోర్ట్ ఉండగా భోగాపురంలో మరలా నిర్మిద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని దిక్కుమాలిన ఆలోచనగా జగన్ అభివర్ణించారు. ఇక విమానాశ్రయం పేరుతో భోగాపురంలో 15వేల ఎకరాల భూమిని సేకరించడం ఎంతవరకు సమంజసం అంటూ జగన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.