జగన్ @ 900..స్టేజి కుప్పకూలింది..!

Sunday, January 21st, 2018, 07:05:45 PM IST

ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న పాదయాత్ర 900 కిమీ కి చేరుకుంది. చిత్తూరు జిల్లా చెర్లోపల్లి వద్ద జగన్ పాదయాత్ర 900 కిమీ చేరుకోవడం విశేషం. ఈ సందర్భంగా జగన్ అక్కడ మొక్కని నాటారు. శ్రీకాళ హస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి లో జగన్ కోసం అక్కడి నాయకులు బహిరంగ సభని ఏర్పాటు చేశారు.

భహిరంగ సభ కోసం జగన్ వేదిక వద్దకు చేరుకుంటున్న సమయంలో తోపులాట జరిగి వేదిక కుప్ప కూలింది. దీనితో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నెల 23 తో చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర ముగియనునట్లు తెలుస్తోంది. అంతటితో సీమలో పాదయాత్ర పరిసమాప్తం అవుతుంది. 23 నుంచి జగన్ నెల్లూరు జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తారు. సీమ జిల్లాల తరువాత వైసీపీకి ఎక్కువ బలం ఉన్న ప్రాంతం నెల్లూరే. జిల్లాలో జగన్ పాదయత్రని విజయవంతం చేయడానికి స్థానిక నేతలు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.