వైఎస్ జగన్ ఫొటో వైరల్ : నోట్లో బన్ను.. చేతిలో చాయ్..

Tuesday, December 5th, 2017, 03:40:34 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ టీడీపీ – వైసిపి ల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఏ మాత్రం తగ్గడం లేదు. తనకు వీలైనంత మందిని కలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎవరు ఎదురొచ్చినా జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో మాట్లాడుతున్నాడు.

ఇక కర్నూలు పాదయాత్రను పూర్తి చేసుకున్న జగన్ ప్రస్తుతం అనంతపురంలో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజలాంత జగన్ ని చూడటానికి భారీ సంఖ్యలో వసున్నారు అయితే మార్గం మధ్యలో జగన్ కి ఓ వ్యక్తి టీ – బన్ ఇచ్చాడు. అయితే జగన్ రోడ్డు మీదే నిలబడి చాయ్ తాగి అతనితో మాట్లాడాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. జగన్ జనాల్లో కలిసిపోతున్నాడు అని అయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments