బాబుకి జగన్ ఎలా బర్త్ డే విషెస్ చెప్పాడో తెలుసా..?

Friday, April 20th, 2018, 11:11:52 AM IST

ప్రజా నేత, అభివృద్దికి దిశానిర్దేశాలు చూపే అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఈ రోజు . ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ నటులు ఏపీ ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం ఒకెత్తయితే వైఎస్ఆర్సీపీ నాయకులు తెలపడం ఒకెత్తు అందులోనూ యువనేత వైఎస్ జగన్ తెలపడం మహా విశేషం, తాజాగా వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి గారు సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుడ్ని మనసారా కోరుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా తన విషెష్ ని తెలిపాడు జగన్.

  •  
  •  
  •  
  •  

Comments