చంద్రబాబు పై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

Monday, October 8th, 2018, 10:59:34 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత నిన్న చీపురుపల్లి లో నిర్వహించిన బహిరంగ సభలో కొన్ని సంచలనకరమైన మరియు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న వై ఎస్ జగన్ యొక్క పాదయాత్ర నిన్న చీపురుపల్లికి చేరుకుంది.గత కొద్ది రోజులుగా ఆంధ్రాలో జరుగుతున్న ఐటీ దాడులకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజులు నుంచి శివాలెత్తిపోతున్నారని,వారి పార్టీకి సంబందించిన నేతలపై ఐటీ శాఖల వారు దాడులు చేస్తుంటే నువ్వెందుకు వణికి పోతున్నావ్ అని,వారి మీద దాడులు చేస్తే నీ డొంక కదులుతుందని భయపడుతున్నావా అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతే కాకుండా ఆ సభ నిర్వహిస్తున్న సమయంలోనే అక్కడి జనం మధ్యలోకి అకస్మాత్తుగా ఒక ప్రభుత్వ అంబులెన్సు వచ్చింది.దానితో వై ఎస్ జగన్ మరింత స్థాయిలో బాబు పై విరుచుకుపడ్డారు.వేరే పక్క నుంచి దారి ఉన్నా సరే కావాలని వారి సభను భంగ పరచడానికి కావాలని టీడీపీ ప్రభుత్వం వారే ఇలా పంపారని మండిపడ్డారు.ఆ అంబులెన్సు లో ఎలాంటి క్షతగాత్రుడు లేడని అయినా సరే మనము దారి ఇద్దామని చెప్పి పంపేశారు.అలా అకారణంగా అంబులెన్సు రావడం పట్ల వై ఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తన సభను భంగపరచడానికే చంద్రబాబు ఇలాంటి నికృష్టమైన ఆలోచనతో ఇంతటి నీచమైన పనికి ఒడిగట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.