జ‌గ‌న్ మొండోడు.. ఎవ‌రి మాటా విన‌డు.. ఇప్పుడు రాసుకోండి..!

Monday, February 11th, 2019, 10:11:15 AM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కోసం సిద్ధం అవుతున్నారు. పాద‌యాత్ర పూర్తి చేసిన జ‌గ‌న్ బ‌స్సుయాత్ర చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య‌లో ఉన్న గ్యాప్‌లో మ‌రో రెండు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి నిత్య ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు జ‌గ‌న్. అన్న‌పిలుపు, స‌మ‌ర‌శంఖారావం కార్య‌క్ర‌మాలు స్టార్ చేసిన వైసీపీ, బూత్‌లెవ‌ల్ కార్య‌క‌ర్త‌ల‌తో స‌హా పార్టీ నేత‌లంతా అన్ని వ‌ర్గాల ప‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ఇక అన్న‌పిలుపు కార్య‌క్ర‌మంతో అయితే ఏకంగా త‌ట‌స్తుల‌నే టార్గెట్ చేశారు జ‌గ‌న్.

అస‌లు విష‌యంలోకి వెళితే.. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల్లో త‌ట‌స్తుల ప్ర‌భావం చాలా వ‌ర‌కు ఉంద‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు. ఈ త‌ట‌స్థ‌ల్లో ఎక్కువ‌గా వైద్యులు, ఇంజనీర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు, ఇలా ప్రైవేటు రంగంలో అత్యంత ప్ర‌భావిత వ్య‌క్తులుగా ఉన్న‌వారంతా తటస్థుల జాబితాలోకి వ‌స్తారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వీరంతా ఎంతో మంది పై ప్ర‌భావం చూప‌గ‌ల‌రు. అలాంటి వారిని ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే.. నోటి మాట చాల జాగ్ర‌త్త‌గా ఉండాలి.

గ‌త ఎన్నిక‌ల్లో త‌ట‌స్థ‌లు ఫార్ములాను గ‌ట్టిగా తెర‌పైకి తెచ్చిన చంద్ర‌బాబు.. జగన్ ఎవరి మాట వినడని.. తాను అనుకున్నదే అమలు చేస్తాడు తప్ప మరొక ఆలోచన చేయడని.. పెద్దలు అంటే గౌరవం అస్సలు ఉండదని.. ప్ర‌చారం చేసి జ‌గ‌న్ పై నెగిటీవ్ తీసుకురావ‌డంతో చంద్ర‌బాబు అండ్ కో విజ‌య‌వంతం అయ్యారు. ఈ క్ర‌మంలోనే అత్య‌ల్పంగా కేవ‌లం 5ల‌క్ష‌ల ఓట్ల‌తేడాతో ఓట‌మి చెందింది వైసీపీ. అయితే ఈసారి తీరుమార్చుకున్న జ‌గ‌న్ ఎలాంటి చిన్న అవ‌కాశాన్ని కూడా విడిచిపెట్ట‌డంలేదు. అందులో భాగంగానే అన్న‌పిలుపు కార్య‌క్ర‌మం ద్వారా త‌ట‌స్తుల‌తో స‌మావేశం అయ్యి.. వారి స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకుంటూ, జ‌గ‌న్ మొండోడు.. ఎవ‌రి మాటా విన‌డు, గ‌ర్వం ఎక్కువ‌, సీనియ‌ర్ల‌ని గౌర‌వించ‌డు అని త‌న‌పై ప‌డ్డ మ‌చ్చ‌ను, ప్ర‌త్య‌ర్ధులు చ‌ల్లుతున్న బుర‌ద‌ను తొల‌గించుకుంటున్నారు. మ‌రి ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను త‌ల‌క్రిందులు చేసే త‌ట‌స్థులతో స‌మావేశాలు వైసీపీకి ఎలాంటి మేలు చేస్తాయో ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తెలిసిపోతుంది.