పవన్ ప్లాన్ ని జగన్ కాపీ కొట్టాడు..చివర్లో అదికూడా అంటూ సంచలన ప్రకటన..!

Monday, September 26th, 2016, 08:35:43 AM IST

jagan1
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం తిరుపతి బహిరంగ సభలో తానూ ప్రతేక హోదా కోసం దశల వారిగా ప్రాతం చేస్తానని ప్రకటించాడు. దశల వారీగా పోరాటాన్ని వేగం పెంచుతామని..అందుకోసం చివరిదశలో ఎంపీల రాజీనామాకు పట్టుబడతామని పవన్ తిరుపతి లో ప్రకటించాడు.ఆ తరువాత జరిగిన కాకినాడ సభలో బిజెపిని విమర్శించడానికి మాత్రమే పవన్ పరిమితమయ్యాడు. ప్రత్యేక హోదా కోసం తన పోరాటాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం పై స్పష్టతనివ్వలేదు. కానీ ఎపి ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ప్రత్యేక హోదా కోసం రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. పవన్ తిరుపతి సభలో ప్రకటించినట్లుగా తానూ ప్రత్యేక హోదా కోసం దశల వారిపోరాటాన్ని చేస్తానని ప్రకటించారు.సాక్షి ఛానల్ లో జరిగిన ఇంటర్వ్యూ లో జగన్ ఈ ప్రకటన చేశారు.

తాను దశల వారీగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ప్రకటించాడు.అవసరమైతే తుదిదశలో తన పార్టీ ఎంపీల చేత రాజీనామా లైనా చేయిస్తానని సంచలన ప్రకటన చేశారు.తమ పార్టీ నుంచి ప్రలోభ పెట్టి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యే లచే చంద్రబాబు రాజీనామా చేయించాలని దమ్ముంటే ఉపఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.వాటిలో వచ్చిన ఫలితాలనే రెఫరెండంగా భావించాలని అన్నారు.