వైసీపీ శ్రేణులు షాక్ అయ్యే న్యూస్.. న‌మ్మిన బంటుకు జ‌గ‌న్ హ్యాండ్ ఇవ్వ‌నున్నారా…?

Tuesday, October 9th, 2018, 04:36:36 PM IST

రాజ‌కీయాలు ఎప్ప‌డు ఏ రంగు పులుము కుంటాయో ఊహించ‌డం చాలా క‌ష్టం. అవ‌స‌రాల‌ను బ‌ట్టి అభ్యర్ధుల‌ను.. పరిస్థితుల‌ను బట్టి న‌మ్మకంగా ఉన్న‌ వారికి కూడా ఒక్కోసారి అన్యాయం జర‌గం నేటి రాజ‌కీయాల్లో చాలా స‌హ‌జం. ఇప్పుడు ఈ మ్యాట‌ర్ ఎందుకంటారా.. ప్ర‌స్తుతం ఇలాంటి సిట్యుయేషనే ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌మైన వైసీపీలో జ‌రుగుతుంద‌నే వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే వైసీపీ నేత‌లంద‌రిలో మంచి పేరున్న వ్య‌క్తుల్లో ముందువ‌రుస‌లో ఉన్న నేత‌ల్లో మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణ ముందువ‌రుస‌లో ఉంటారు. నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణానంత‌రం ఓదార్పుయాత్ర‌లో భాగంగా జ‌గ‌న్‌తో పాటే రాష్ట్ర‌మంత‌టా తిరిగారు. ఇక 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక చేసిన త‌ప్పుల‌ను నిత్యం ఎత్తి చూపుతూ త‌ర‌చూ టీడీపీనిని ఇర‌కాటంలో పెడుతూ.. చివ‌రికి అధికార పార్టీని కోర్టుకు కూడా లాగి చంద్ర‌బాబు కంటిలో న‌లుసుగా మారారు.

అలాంటి ఆర్కేకి ఏపీలో రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున టికెట్ క‌ష్ట‌మే అనే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో అన్ని జిల్లాల్లోని మొత్తం 175 సెగ్మెంట్ల‌లో ఎవ‌రెవ‌రికి సీట్లు కేటాయించాలోఅన్న విష‌యం పై వైసీపీ అధినేత క‌స‌ర‌త్తులు చేస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి వైసీపీ త‌రుపున టికెట్ క‌ష్ట‌మ‌ని జ‌గ‌న్ పార్టీనేత‌ల‌కు తేల్చిచెప్పార‌ని స‌మాచారం. ఆ లిస్ట్‌లో మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణ కూడా ఉన్నాడ‌నే వార్త వైసీపీ శ్రేణుల నుండి లీక్ అయ్యింది. దీంతో ఈ వార్త ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.