ఎలక్షన్ 2019: ఆ రెండు జిల్లాల్లో ఫ్యాన్ కు ఎదురుగాలి తప్పదా..?

Friday, March 15th, 2019, 03:04:50 AM IST

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య గట్టి పోటీ నడుస్తుండగా కొత్తగా రేసులోకి వచ్చిన జనసేన కూడా రాబోయే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించే దిశగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ప్రజాసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీ క్యాడర్ ను పటిష్టం చేసిన వైసీపీ అధినేత జగన్ కు రెండు జిల్లాల్లో వైసీపీ కాస్త బలహీనంగా ఉండటం కలవర పెడుతుంది. వైసీపీ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ చేయించిన సర్వేలతో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి చేయించిన సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి, ఇది వైసీపీ శ్రేణులు ఆనందింపదగిన విషయమే అయినప్పటికీ మరో సర్వే ఫలితాలు మాత్రం జగన్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయట.

ప్రశాంత్ కిషోర్, విజయసాయిరెడ్డిల సర్వేలతో పాటుగా జగన్ రహస్యంగా ఐదు సర్వేలు చేయించారట, వాటిల్లో ఒక సర్వేలో వైసీపీ రెండు జిల్లాల్లో బలహీనంగా ఉందని తేలిందట. ఆ రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం కావటం, అక్కడ అధికార టీడీపీకే బలం ఎక్కువ ఉండటం జగన్ కలవరపెడుతుందని సమాచారం. ఇంతకీ ఆ రెండు జిల్లాలు ఏంటంటే ఒకటి రాజధానికి దగ్గరగా ఉన్న కృష్ణా జిల్లా, మరొకటి తూర్పు గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని నిర్ణయించేది తూర్పు గోదావరి జిల్లాయే, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటానికి ముఖ్యకారణం కూడా తూర్పు గోదావరి జిల్లాయే. అందుకే జగన్ ఆ సర్వే రిజల్ట్ చూసి టెన్షన్ పడుతున్నారట, ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి ఆ రెండు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఎవరైనా ముఖ్య నేతలు ఎవరైనా చేరతారా అని ఎదురు చూస్తున్నారట. దీన్ని బట్టి మరో రెండు మూడు రోజుల్లో వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.