జగన్ యువభేరి..గట్టిగా మోగిస్తాడా..?

Wednesday, September 21st, 2016, 03:10:03 PM IST

ysrcp
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గురువారం ఏలూరు లో జరిగే యువభేరి కార్యక్రమంలో పాల్గొననున్నాడు.ప్రత్యేక హోదా అజెండా గా ఈ కార్యక్రమం జరగనుంది.వైసిపి నేత ఆళ్ళ నాని యువభేరి సభ పనులను సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజ్ కి స్వాగతం చెప్పిన టిడిపి రాష్ట్ర యువత భవిష్యత్తు ను నాశనం చేసిందని ఆరోపించారు. రేపటి యువభేరి సభలో పాల్గొనేందుకు యువత తరలి రావాలని ఆయన కోరారు.

కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పేసి ఏపీ కి ప్యాకేజ్ ని ప్రకటించింది. ఈ తరుణంలో జగన్ యువభేరి కార్యక్రమం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందనేది రాజకీయ వర్గాల వాదన. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా పోరాడాల్సిన అవసరం ఉందని..కాకపోతే కేవలం టిడిపిని, చంద్రబాబుని విమర్శించినంత మాత్రాన ప్రతి పక్షం బాధత్య తీరిపోదని అంటున్నారు.జగన్ ఇంతవరకు ప్రత్యక్షంగా మోడీపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు.మోడీ నిర్ణయం తీసుకోవలసిన ప్రత్యేక హోదా అంశం పైన టిడిపిని విమర్శిస్తే ఒరిగే ప్రయోజనం ఏమి లేదని విశ్లేషకులు అంటున్నారు.రేపటి యువభేరి సభ లోనైనా జగన్ మోడీ పై యుద్ధ భేరి మోగిస్తాడా..?