జగన్ రీఎంట్రీ .. జనం పోటెత్తడం ఖాయం !

Tuesday, October 30th, 2018, 10:00:11 AM IST

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత ఏడాది కాలంగా చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో రోజుల నుండి రాష్ట్రమంతా తిరుగుతున్నా ఆయన పర్యటన ఏనాడూ జనాలకు బోర్ కొట్టలేదు. ఎక్కడికి యాత్ర చేసినా, ఎక్కడ సభలు నిర్వహించిన వేలాదిగా ప్రజలు హాజరవుతున్నారు. కొంతమంది ప్రజల్లో ఆయన పట్ల అభిమానం ఉంటే ఇంకొంతమందిలో సానుభూతి ఉంది.

ఈ సానుభూతే జగన్ కు రాబోయే రోజుల్లో మరింత మైలేజీ ఇవ్వనుంది. ఈ నెల 25న విశాఖ విమానాశ్రయంలో జగన్ ఫై జరిగిన కత్తిదాడి రాష్ట్రం మొత్తం అలజడి రేపింది. ఆయన అభిమానులు, వైకాపా కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారు. కారకులు ఎవరైనా ఈ దాడితో పల్లెల్లోని జనాల్లో జగన్ పట్ల ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఇదే జగన్ కు బాగా కలిసొచ్చే అంశం.

ఈ దాడితో వాయిదాపడిన జగన్ యాత్ర 3వ తేదీ నుండి పునఃప్రారంభం కానుంది. రీస్టార్ట్ చేయబోయే ఈ యాత్రను మరింత ఉదృతంగా చేయాలని, తనపై జరిగిన దాడిని ప్రధానంగా ప్రజల ముందు ఉంచి, టీడీపీ సర్కారును ఒక ఆట ఆడుకోవాలని జగన్ భావిస్తున్నారట. ఈమేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం జరిగిందట. ఇకపై ఎక్కడ యాత్ర జరిగినా దానికి ఆ ప్రాంతంలోని ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడ జనం పోటెత్తేలా ఏర్పాట్లు చేస్తున్నారట నేతలు.

  •  
  •  
  •  
  •  

Comments