3000 కిలోమీటర్ల దిశగా జగన్ పాద యాత్ర..!

Thursday, September 20th, 2018, 07:42:25 PM IST

దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజా సంకల్ప యాత్ర పేరిట తన పాద యాత్ర మొదలు పెట్టారు.ప్రజా సమస్యలే ముఖ్యంగా తాను ముఖ్యమంత్రి అయ్యి ప్రజల యొక్క కష్టాలని అన్నింటినీ సమూలంగా నిర్మూలన చెయ్యాలని ఈ పాద యాత్రను గత సంవత్సరం నవంబర్ నెలలో ఇడుపులపాయ వద్ద మొదలు పెట్టి ఇప్పుడు ఉత్తరాంధ్రలో కొనసాగుతుంది.ఐతే ఈ మహత్తర కార్యం ఒక అరుదైన మైలురాయిని అందుకోనుంది.ఇడుపులపాయ వద్ద మొదలయ్యిన ఈ పాదయాత్ర ఇపుడు దేశపాత్రునిపాలెంకు చేరుకోవడంతో 3000 కిలోమీటర్ల మైలురాయిని అందుకోనుంది.

వై ఎస్ జగన్ ఈ పాదయాత్రలో తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎండా వానా తేడా లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కొనసాగిస్తున్నారు.ఈ నెల 24వ తేదీన విజయనగరం జిల్లాకి చేరుకొని దేశపాత్రునిపాలెంతో 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది.దీనితో అక్కడ కొత్తవలసలోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు అన్నట్టు తెలుస్తుంది.అదే విధంగా వంగవీటి రాధ జగన్ తో మంతనాలు జరుపుతున్నారని,వారు పార్టీని వీడలేదని వైసీపీ కార్యదర్శి రఘురాం తెలిపారు.ఇప్పటికే 11 జిల్లాలు పూర్తయ్యిందని ఇప్పుడు 12వ జిల్లాలోకి జగన్ అడుగుపెట్టి తన 3000 కిలోమీటర్ల పాదయాత్రని పూర్తి చేస్తారని తెలిపారు.