వంగ‌వీటిని అణ‌చివేసిన జ‌గ‌న్?

Sunday, October 7th, 2018, 03:00:25 AM IST

వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఏపీలో తిరుగులేన‌ట్టేనా? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. అస‌మ్మ‌తి వ‌ర్గాన్ని బుజ్జ‌గిస్తూనే చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్న జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ్య‌తిరేకంగా ఎవ‌రైనా అడుగులు వేస్తున్నార‌ని తెలిస్తే వెంట‌నే వారికి చెక్ పెడుతున్నాడు. ఇప్ప‌టికే నియోజ‌క వ‌ర్గాల‌కు సంబంధించిన ఇన్‌చార్జ్‌ల‌ను త‌ప్పిస్తూ చ‌క‌చ‌కా కొత్త స‌మీక‌ర‌ణాల‌ను మొద‌లుపెట్టి ఎన్నిక‌ల‌కు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నాడు. సొంత పార్టీ నేత‌ల్లో ఎలాంటి వ్య‌తిరేక‌త జ‌గ‌న్ పై క‌నిపించ‌క‌పోవ‌డంతో మీడియానే అతి చేస్తోంద‌ని కొంత మంది విశ్లేష‌కులు చెబుతున్నారు..

వంగ వీటి రాధా అస‌మ్మ‌తికి కేంద్ర బిందువుగా మారే అవ‌కాశం వున్నా ఆ స‌మ‌స్య‌ను తెలివిగా ప‌రిష్క‌రించిన జ‌గ‌న్ తాజాగా రాధాకు రెండు ఆప్ష‌న్లు ఇచ్చాడ‌ట‌. దీంతో రాధ కూడా సైలెంట్ అయిపోయిన‌ట్టేన‌ని ఇక వైసీపీలో ఎలాంటి అస‌మ్మ‌తి వ‌ర్గం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి త‌గ్గ‌ట్లు గానే జ‌గ‌న్ రాజ‌కీయ చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ అస‌మ్మ‌తి వ‌ర్గాల‌ని మారుస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే కంటిలో న‌లుసులా నెల్లూరుకు చెందిన వైసీపీ నాయ‌కుడు బొమ్మిరెడ్డి వ్య‌వ‌హారం జ‌గ‌న్‌ను కుదిపేస్తున్నా అదేమంత ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం లేద‌ని, క్షేత్ర‌స్థాయిలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భంజ‌న ఖాయమైన‌ట్టే న‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక‌పోతే వంగ‌వీటి రాధా వైకాపా నుంచి జంప్ అవుతారంటూ ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే రెండు ఆప్ష‌న్లు ఉన్నాయంటూ అత‌డిని సందిగ్ధంలో పెట్టాడా? లేక ఆప్ష‌న్ క్లియ‌ర్‌క‌ట్‌గానే ఇచ్చేశాడా? అన్న‌దానిపై క్లారిటీ రాలేదింకా.