నేను ముఖ్యమంత్రి అయ్యాక మీ అంతు చూస్తానంటున్న జగన్

Thursday, January 26th, 2017, 09:00:33 PM IST

jagan2
గురువారం సాయంత్రం ప్రత్యేక హోదా కోసం వైజాగ్ ఆర్కే బీచ్ లో వైస్సార్సీపీ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణం వెళ్లారు. కానీ ఆయనువిమానాశ్రయంలోనే అడ్డుకున్న పోలీసులు ఆయనను అక్కడే నిర్బంధించారు. దీంతో జగన్ రన్ వే పైనే ధర్నా చేస్తున్నారు. అయినా పోలీసులు తమను బయటకు అనుమతించకపోవడంతో జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురయ్యారు.

ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘రెండే రెండేళ్లలో తాను ముఖ్యమంత్రి అవుతానని… అప్పుడు మీ అంటూ చూస్తానని… మీ పేర్లు కూడా గుర్తు పెట్టుకుంటానని… ఎవరినీ మరచిపోనని’ ఆయన పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు. ‘అసలు మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆపుతున్నారని.. ఒక ప్యాసెంజర్ గా కూడా డొమెస్టిక్ అరైవల్ లోకి వెళ్లనివ్వరా…? మమ్మల్ని ఏం చేయాలనీ మీరు ఇక్కడ ఉన్నారని’ ఆయన పోలీస్ లను ప్రశ్నించారు. జగన్ వెంట ఉన్న మరొక నేత ‘తాము అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తు పెట్టుకుని మరీ మీ అందరిని పట్టుకుంటామని’ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ విమానాశ్రయంలోనే నినదించారు.