వైఎస్ జ‌గ‌న్‌కు భ‌ద్ర‌త పెంపు.. కార‌ణం తెలిస్తే షాక్‌..!

Monday, April 15th, 2019, 08:21:50 PM IST

ఓ వైపు చంద్ర‌బాబు నాయుడు ఏడుపులు.. పెడ‌బెబ్బ‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రో వైపు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ త‌న ప‌నిని తాను కూల్‌గా చేసుకుపోతున్నాడు. పోలింగ్ స‌ర‌ళిని అంచ‌నా వేసిన ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు జ‌గ‌నే సీఎం అని తేల్చేశాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు ముందుగానే జ‌గ‌న్ భ‌ద్ర‌త‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.

కాబోయే సీఎంకు కావాల్సిన భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌నున్నాయి. పోలింగ్ నాటి నుంచి వైసీపీ శ్రేణులు గెలుపుమూడ్‌లోకి వ‌చ్చేయ‌గా అన్నివ‌ర్గాల నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ నేత‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. టీడీపీ నేత‌లు బ్యాలెన్స్ కోల్పోయి విమ‌ర్శ‌ల హోరు కొన‌సాగిస్తుండ‌గా వైసీపీ నేత‌లు మాత్రం ఎదిగిన కొద్ది ఒదిగిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డే అంటూ అభిమానులు త‌యారు చేసిన నేమ్‌ప్లేట్ సామాజిక‌మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మార‌గా అభిమానుల‌కు మాత్రం ముందుగానే పండుగ‌ను తీసుకొచ్చింది. జ‌గ‌న్ టైమ్ ఆయేగా అంటూ తెలుగునాట సంద‌డే.. సంద‌డి జ‌రుగుతోంది.