`యాత్ర‌`ను కళ్లకు కట్టినట్టు చూపించారు!-వైయ‌స్‌ విజ‌య‌మ్మ‌

Tuesday, February 12th, 2019, 12:02:30 AM IST

మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర నేప‌థ్య ంలో రూపొందించిన యాత్ర సినిమా ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తొలి మూడు రోజుల్లోనే 5.5 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లో 3.5కోట్లు వ‌సూలైంది. మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వ ంలో విజ‌య్ చిల్లా- శ‌శిదేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ అన్న టాక్ తెచ్చుకుంది. తాజాగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి వైయ‌స్ విజ‌య‌మ్మ ఈ సినిమా ప్రివ్యూని వీక్షించారు. సినిమా వీక్షించిన అనంత‌రం వైఎస్ విజయమ్మ ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ రాజశేఖర్ ‌రెడ్డిని కళ్లకు కట్టినట్టు మరోసారి ప్రజలకు చూపించారని అన్నారు.

ప్రివ్యూ అనంత‌రం వైయ‌స్ విజయమ్మ మాట్లాడుతూ- రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఇంత మంచి చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ మహిరెడ్డికి, చిత్ర బృందానికి అభినందలు. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని.. మరోసారి ప్రజల కళ్లకు కట్టినట్టు చూపారు.. అని అన్నారు. ఆనాడు, రాజశేఖర్‌రెడ్డిని ఆదరించిన ప్రజలు.. ఇప్పుడు ఆయన పిల్లలను కూడా అక్కున చేర్చుకుంటున్నారని విజయమ్మ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ దన్యవాదాలు తెలిపారు. యాత్ర చిత్రం ఈ సీజ‌న్ లో రిలీజైన బయోపిక్ ల‌లో ఘ‌న‌విజ‌యం సాధించింద‌ని ట్రేడ్ చెబుతోంది. యాత్ర తొలి వారంలో 5.5 కోట్ల షేర్ వ‌సూలు చేసింద‌ని రిపోర్ట్ అందింది. ఇక ఎన్నికల వేళ ఈ సినిమాపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. యాత్ర‌ అంచనాలను అందుకోవడంతో సక్సెస్ అయింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుని మంచి కలెక్షన్లు రాబట్ట‌డంపై వైయ‌స్ అభిమానుల్లోనూ ఉత్సాహం నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వైయ‌స్ జ‌గ‌న్ ని క‌లిసి ముచ్చ‌టించడం విశేషం.