విజయమ్మకు భద్రత పునరుద్దరణ

Monday, September 15th, 2014, 08:29:18 PM IST


గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విజయమ్మకు భద్రత తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవఅధ్యక్షురాలు హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. తొలగించిన భద్రతను తిరిగి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం విజయమ్మకు 2+2 భద్రతను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. విజయమ్మ కుమార్తె షర్మిలకు, బ్రదర్ అనిల్ కు యధావిధి భద్రతను ఏర్పాటు చేయాలని కోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.