2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మ్మ పోటీ.. ఈ నిర్ణ‌యం ఎవ‌రిది..?

Saturday, January 12th, 2019, 02:30:53 PM IST

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆశ‌క్తిక‌ర‌మైన విష‌యాలు చ‌ర్చించారు. రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న వేళ ఆమె చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డంలేద‌ని, అవ‌స‌రం అయితే ప్ర‌చారం మాత్రం చేస్తాన‌ని విజ‌య‌మ్మ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్ళార‌ని విజ‌య‌మ్మ అన్నారు.

ఇక గ‌త ఎన్నిక‌ల నేప‌ధ్యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయ్యాడ‌ని విజ‌య‌మ్మ అన్నారు. ఇక విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌లో జ‌గ‌న్ పై దాడి జ‌రిగితే, దాన్ని అవ‌హేళ‌న చేయ‌డం త‌న‌కు చాలా బాధ క‌ల్గించిద‌ని విజ‌య‌మ్మ తెలిపారు. గ‌తంలో వైసీపీని పిల్ల కాంగ్రెస్ అన్న చంద్ర‌బాబే ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ ఆమె ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర వ‌ల్ల రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌కమైన మార్పు వ‌చ్చింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ దాదాపు 120 సీట్లుకు పైగానే గెలుస్తోంద‌ని, వైసీపీ విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని విజ‌య‌మ్ పేర్కొన్నారు.