వైఎస్ వివేకానంద‌రెడ్డిది హ్యత్యే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు..!

Friday, March 15th, 2019, 05:29:15 PM IST

వైఎస్ వివేకానంద‌రెడ్డి భౌతిక‌కాయానికి పోస్టు మార్టం పూర్త‌యింది. పులివెందుల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పోస్టు మార్టం పూర్తి చేసిన వ్యైద్యులు.. ఆ త‌ర్వాత వివేకానంద‌రెడ్డి భౌతిక‌కాయాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ఇక వివేకానంద‌రెడ్డి పోస్టు మార్టం రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అందరూ అనుమానించిన‌ట్టుగానే, వివేకానంద‌రెడ్డిది హ‌త్యే అని పోలీసులు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేల్చారు.

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా హ‌త్య అని తేలింది. వివేకానంద రెడ్డి శ‌రీరం పై 7 క‌త్తిపోట్లు ఉన్నాయ‌ని, పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేసినట్లు వైద్యులు త‌మ నివేదిక‌లో వెల్ల‌డించారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్ర‌మంలో దీనికి స‌బంధించి క‌ర్నూలు నుండి ఫోరెన్సిక్ నిపుణులు పులివెందుల‌కు రానుండ‌గా, ఈ కేసుకు సంబంధించి మ‌రి కొన్ని కీల‌క ఆధారాలు దొరికిన‌ట్లు పోలీసులు వెళ్ళ‌డించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు, అధికారులు మాత్రం వివేకానంద‌రెడ్డిది హ‌త్యే అని అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఇక వివేకానంద‌రెడ్డి నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో మంచి వ్యక్తిత్వం కలిగిన ప్రజానేతను కోల్పోయామంటూ స‌ర్వ‌త్రా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.