వివేకానంద‌రెడ్డి మృతి.. సంచ‌ల‌న లేఖ‌లో.. షాకింగ్ విష‌యాలు..!

Friday, March 15th, 2019, 04:01:21 PM IST

వైఎస వివేకానంద‌రెడ్డి మృతిలో అనేక కొత్త కొత్త ట్విస్ట్‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. తొలుత వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో మ‌రణించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వెంట‌నే వివేకా మృతి పై ప‌లు అనుమానాలు ఉన్నాయ‌ని ఆయ‌న పీనే కృష్ణా రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఒక్క‌సారిగా సంచ‌ల‌నంగా మారింది. ఈ క్ర‌మంలో వివేకా పీఏ కృష్ణా రెడ్డి పోలీసుల‌కు స‌మ‌ర్పించిన లేఖ‌లో కొన్ని షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించారు.

ఇక ఆ లేఖ‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే.. వివేకానంద‌రెడ్డి గారి పీఏ.. ఎం.వి.కృష్ణారెడ్డి వ్రాయునది ఏమనగా నేను ఈ రోజు ఉదయం 05 :30 గంటలకు వైఎస్ వివేకానందరెడ్డి గారి ఇంటికి వెళ్ళ‌గా.. అప్పటికి సార్ నిద్ర లేవలేదు. దీంతో నేను ఒక అరగంటసేపు పేపర్ చదివిన తర్వాత ఆయన భార్య సౌభాగ్యమ్మగారికి ఫోన్ చేసి సార్ నిద్ర లేవలేదు.. నేను నిద్ర లేపుతానని చెప్పాను.

అందుకు ఆవిడ.. సార్ రాత్రి లేటుగా వచ్చి ఉంటారు, నిద్ర లేపవద్దు అని చెప్పారు. దీంతో సార్‌ని నేను నిద్ర‌లేప‌లేదు. ఆ తర్వాత అరగంటకు వంట చేసే లక్ష్మీ మరియు వారి కుమారుడు ప్రకాష్ వచ్చారు. అప్పుడు నేను లక్ష్మీతో.. సార్ అరుస్తారు నిద్ర లేపమని చెప్పాను. లక్ష్మీ ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని చెప్పింది. తర్వాత నేను పోయి పిలిచాను.. అయిరా సార్ లేవలేదు. తర్వాత మా వాచ్‌మెన్ రంగన్న సైడ్ డోర్ తెరిచి ఉంది అన్నాడు. అప్పుడు నేను, ప్రకాష్ ఇద్దరం ఒకేసారి లోపలికి వెళ్ళాము.

బెడ్ రూమ్ డోర్ కూడా ఓపెన్ ఉంది.. బెడ్ రూమ్ దగ్గర దాదాపు రెండు లీటర్ల బ్లడ్ పడి ఉంది కానీ సార్ లేడు. తర్వాత బాత్ రూమ్‌లో చూస్తే అక్కడ బ్లడ్ లోనే కింద పడి ఉన్నారు. వెంట‌నే చెయ్యి పట్టుకుని చూస్తే సార్ నాడి పని చెయ్యట్లేదు. తల నుదుటి పైన, తల వెనక, అరచేతికి గాయాలు ఉన్నాయి. నేను ప్రకాష్‌తో మన సార్ లేరు అని చెప్పి బయటకు వచ్చాను. ఆ త‌ర్వాత‌ సార్ అల్లుడు ఎన్.రాజాగారికి మరియు సౌభాగ్యమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను.

అయితే మరణానికి కారణము మాత్రం త‌న‌కు తెలియదని కృష్ణారెడ్డి తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. అలాలే ఫోరెన్సీక్ నిపుణులను కూడా రప్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్ప‌టికే రంగంలోకి డాగ్ స్క్వాడ్‌ని దింపారు. పలువురి నుండి వివరాలు సేకరిస్తున్నారు. ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే పోస్ట్ మార్ట‌మ్ నివేదికలో వైఎస్ వివేకానంద‌రెడ్డిది హ‌త్యే అని తేలింది. ఈ కుట్ర వెనుక ఎవ‌రి హ‌స్తం ఉందో తెలియాల్సి ఉంది.