వైఎస్ వివేకానంద‌రెడ్డి మృతి : ఆ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికేనా..?

Friday, March 15th, 2019, 03:39:56 PM IST

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ సోద‌రుడు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇవాళ హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. వివేకానంద‌రెడ్డి మృతిపై మొద‌ట మీడియా చానెళ్ల వారు మాత్రం గురువారం రాత్రి వ‌ర‌కు ఎంతో ఆరోగ్యంగా తిరిగిన ఆయ‌న హ‌ఠాత్తుగా గుండెపోటు రావ‌డంతో ఈ రోజు తెల్ల‌వారుజామున అకాల‌మ‌ర‌ణం చెందార‌ని క‌థ‌నాల‌ను ప్ర‌చురించారు. ఆ త‌రువాతి కొద్దిసేప‌టికే వైఎస్ వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో మ‌ర‌ణించారా..? లేక హ‌త్య‌కాబ‌డ్డారా..? అన్న హెడ్డింగుల‌తో మ‌ళ్లీ మ‌రొక క‌థ‌నాల‌ను ప్ర‌చురించ‌డం మొద‌లు పెట్టారు. అంత‌కు ముందు వైఎస్ వివేకానంద‌రెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఆయ‌న మృతిపై అనుమానాలు ఉన్నాయ‌ని, త‌న అనుమానాల‌ను నివృత్తి చేయాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కాగా, కృష్ణారెడ్డి త‌న ఫిర్యాదులో వైఎస్ వివేకానంద‌రెడ్డి మృతిపై తన‌కు ఉన్న అనుమానాల‌ను పోలీసుల‌కు లిఖిత‌పూర్వ‌కంగా అందించారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి..

1) వైఎస్ వివేకానందరెడ్డి శ‌రీరంపై ఐదు గాయాలు.
2) త‌ల వెనుక భాగంలో రెండు బ‌ల‌మైన గాయాలు.
3) నుదుటి భాగం, ముక్కు, అర చేతికి గాయాలు.
4) వైఎస్ వివేకానంద‌రెడ్డికి హ‌త్యేనంటున్న స‌న్నిహితులు.
5) బాత్రూమ్‌లో చ‌నిపోయి ఉంటే బెడ్‌రూమ్‌లో బ్ల‌డ్ ఎలా వ‌చ్చింది..?
6) బెడ్ రూమ్‌లో రెండు లీట‌ర్ల‌కు పైగా బ్ల‌డ్.
7) ఇంటి వెనుక భాగంలో తెరిచి ఉన్న డోర్.
8) అర్ధ‌రాత్రిపూట దుండ‌గులు వెనుక డోర్ నుంచి వ‌చ్చి దాడి చేశారా..?
9) బెడ్‌రూమ్‌లో దాడిచేసి బాత్రూమ్‌లో ప‌డేశారా..?
10) హ‌త్య కేసును స‌హ‌జ‌మ‌ర‌ణంగా మార్చే ప్ర‌య‌త్నం చేశారా..?

ఇలా పైన పేర్కొన్న అంశాల‌ను వేవివేకానంద‌రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మ‌రోప‌క్క వైఎస్ వివేకానంద‌రెడ్డి మృతి రాజ‌కీయ కోణంలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.