చివరి కోరిక నెరవేరకుండానే కనుమూసిన వివేకా…!

Friday, March 15th, 2019, 02:09:01 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్, వైఎస్ వివేకానంద రెడ్డి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో పులివెందులతో పాటు కడప జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్వార్త విన్న తర్వాత ఆయన అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు, ఈ క్రమంలో వివేకా చివరి కోరిక నెరవేరకుండానే కనుమూశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివేకా బతికున్నంత కాలం తన అన్న కొడుకు జగన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆఖరి కోరిక అని, అందుకోసం కష్టపడి పని చేస్తానని అంటుండేవారని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు. వివేకా నిన్నటి రోజున కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఏ పని చేసినా చిత్తశుడితో చేసేవారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వివేకా మరణ వార్త వైఎస్ కుటుంబంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు అనుచరుల కుటుంబాల్లో కూడా విషాదాన్ని నింపింది.