బిగ్‌బ్రేకింగ్ : వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత

Friday, March 15th, 2019, 07:20:13 AM IST

YS Vivekananda Reddy Passes away

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సోదరుడు, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నుమూశారు. పులివెందులలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయిన వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిచెందారు.

ఈ క్ర‌మంలో ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఇక 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిన్నతమ్ముడైన వివేకానంద రెడ్డి.. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. వైఎస్ సోదరుడిగా.. వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయ‌డ‌మే కాకుండా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుడి భుజంగా మెలిగారు. అయితే గ‌త కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. ఇక‌ బాబాయ్ వివేకానంద‌రెడ్డి మరణంతో జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.