వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య‌కు బీజం ప‌డింది అక్క‌డే..!

Friday, March 15th, 2019, 10:46:16 PM IST

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం క‌డ‌ప లోక్ స‌భ సీటును ఆదినారాయ‌ణ రెడ్డికి ప్ర‌క‌టించ‌గానే వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు బీజం ప‌డింద‌ని వైసీపీ నేత వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌ట్నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని ఫినీష్ చేస్తానంటూ సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు క్ర‌మ‌.. క్ర‌మంగా వాస్త‌వ‌రూపం దాలుస్తున్నాయ‌ని శ్రీ‌నివాస్ అన్నారు.

నేటి తెల్ల‌వారు జామున మృతి చెందిన వైఎస్ వివేకానంద‌రెడ్డి గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌మ్మ‌ల‌మ‌డుగులో ప‌ర్య‌టించి రాత్రిపూట ఇంటికి చేరుకున్నార‌న్నారు. ఎప్పుడైతే జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆది నారాయ‌ణ‌రెడ్డిని క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారో అప్పుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు బీజం ప‌డింద‌ని తెలుస్తుంద‌న్నారు.

ఆ క్ర‌మంలోనే మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి వైసీపీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డిని జ‌మ్మ‌ల‌మ‌డుగులో అడుగుపెట్ట‌నివ్వన‌న్నార‌ని, ఈ యొక్క ఫ్యాక్ష‌న్ మాట్లాడ‌టం జ‌రుగుతుంద‌న్నారు. ఎన్నో అక్ర‌మాల‌పై న‌మోదైన కేసుల‌పై సిట్ వేస్తున్న సీఎం చంద్ర‌బాబు నాయుడు.. ఆ కేసుల‌న్నిటినీ నీరుగారుస్తున్నార‌ని, వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసు విచార‌ణ‌ను సిట్‌కు కాకుండా, సీబీఐకి బ‌ద‌లాయించాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తెలిపారు.