వివేకా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ : స్థానికులు చెబుతున్న.. సంచ‌ల‌నం ఇదే..!

Saturday, March 16th, 2019, 10:36:06 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచ‌ల‌నం రేపుతోంది. వివేక‌నంద‌రెడ్డి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింద‌ని స‌మాచారం. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు ముందు రోజు నుండే రెక్కీ నిర్వ‌హించార‌ని స‌మాచారం.

రెక్కీలో భాగంగా వివేకా ఇంటి ప‌రిస‌రాల్లో నిత్యం అక్క‌డే తిరుగుతూ ఉండే కుక్క‌ను, కొంత‌మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కొట్టి చంపేశారు. ఆ ప్రాంతంలో కొత్త‌గా ఎవ‌రైనా వ్యక్తులు క‌న‌బ‌డితే, ఈ కుక్కు మొర‌గ‌డ‌మే కాకుండా వెంట‌బడుతోంది. దీంతో వివేకా హ‌త్య‌కు రెక్కీ నిర్వ‌హించిన దుండ‌గులు కుక్క ప్రాణాలు కూడా తీసేశారు.

ఆ కుక్క ఉంటే, ఆ ప్రాంతానికి వెళ్ళే స‌మ‌యంలో, ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని భావించారు. రెక్కీలో భాగంగానే కొంత‌మంది వ్యక్తులు, ఆ కుక్క అడ్డు తొల‌గించుకునేందుకే హ‌త్య చేసిన‌ట్లు అక్క‌డి స్థానికులు చెబుతున్నారు. ప్లాన్‌లో భాగంగా ముందుగా పథ‌కం ప్ర‌కారం కుక్కును చంపేసి, ఆ త‌ర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా వివేకానంద‌రెడ్డిని హ‌త్య చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సిట్ ద‌ర్యాప్తుకు ఆదేశించ‌గా, వైసీపీ నేత‌లు మాత్రం సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.