బిగ్‌న్యూస్ : వైఎస్ వివేకా హ‌త్య కేసులో.. నిందితుడు అత‌నేనా..?

Friday, March 15th, 2019, 09:09:46 PM IST

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో షాకింగ్ అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. స‌హ‌జ మ‌ర‌ణం నుండి హ‌త్యగా మారిన వివేకానంద‌రెడ్డి కేసులో నమ్మ‌లేని నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఒంటి పై గాయాలు ఉండ‌డంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి తొలుత పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, కేసు న‌మోదు చేసుకున్న పోలీసుల ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్ట్‌లో వివేకాది హ‌త్య అని తేల‌డంతో.. ఈ హ‌త్య వెనుక సుధాక‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి హ‌స్తం ఉంద‌ని వైఎస్ కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎందుకంటే సుధాక‌ర్ రెడ్డి గ‌తంలో వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసులో నిందితులుగా ఉన్న 13 మందిలో సుధాక‌ర్ రెడ్డి కూడా 8వ నిందితుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. ఉమ్మ‌డి హైకోర్టు 2006లో వీరికి జీవిత ఖైదు వేసింది. అయితే తాజాగా స‌త్ప్ర‌వ‌ర్త‌న కింద సుధాక‌ర్ ఎడ్డి మూడు నెల‌లు క్రిత‌మే క‌డ‌ప జైలు నుండి విడుద‌ల అయ్యాడు. అయితే ఇప్పుడు వివేకానంద‌రెడ్డి హ‌త్య‌తో కూడా సుధాక‌ర్ రెడ్డికి సంబంధం ఉందా అనే అనుమానాల‌ను వివేకా వ‌ర్గీయులు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక పోలీసుల అనుమానం కూడా ప్ర‌స్తుతం సుధాక‌ర్ రెడ్డి పైనే ఉంది. దీంతో సుధాక‌ర్ రెడ్డి కోసం ప్ర‌త్యేక బృందాలు రంగంలోకి దిగాయ‌ని స‌మాచారం. మ‌రి వివేక‌నంద రెడ్డి హత్య కేసులో ముందు ముందు ఎవ‌రెవ‌రి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.