త‌న పై హ‌త్యాయ‌త్నం.. సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌పెట్టిన‌ జగన్..!

Tuesday, October 30th, 2018, 10:56:33 AM IST

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పై జ‌రిగిన దాడిపై తాజాగా సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టపెడుతూ క్రేంద్ర హోమంత్రికి లేఖ రాశార‌నే వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో త‌న పై దాడి జ‌రిగిన వెంట‌నే.. సానుభూతి కోసం చేయించుకున్నాన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీజీపీ ముందుగానే చెప్పేసారని.. దీంతో త‌న పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న పై నిజాలు వెలుగులోకి రావ‌ని.. అందుకే ఏపీ టీడీపీ స‌ర్కార్ నియ‌మించిన సిట్ పై త‌న‌కు త‌మ్మ‌కం లేద‌ని అన్నాన‌ని కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖ‌లో జ‌గ‌న్ పేర్కొన్నారు.

ఇక త‌న పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జ‌రిగిన త‌ర్వాత హైద‌రాబాద్ ఎందుకు వ‌చ్చానో వివ‌రంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివ‌రించాన‌ని.. అయితే చంద్ర‌బాబు అండ్ కో మాత్రం త‌న పై నెగిటీవ్‌గా ప్ర‌చారం చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. చంద్ర‌బాబు అండ్ కో మొత్తం ముందుగానే ప్రిపేర్ అయ్యార‌ని.. దీంతో త‌న పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న పై నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని జ‌గ‌న్ తేల్చేశారు. విమానాశ్ర‌యంలో త‌న పై దాడి చేయ‌డం ద్వారా.. త‌న‌కు ఏమైనా జ‌రిగితే.. అక్క‌డి భ‌ద్ర‌త రాష్ట్ర‌ప‌రిదిలో ఉండ‌దు కాబ‌ట్టి కేంద్రం పై నెట్టేసి టీడీపీ ల‌బ్దిపోందాల‌నే చంద్ర‌బాబు ప్లాన్ వేశార‌ని జ‌గ‌న్ ఆ లేఖ ద్వారా తెలిపారు. హత్యాయత్నం ఘటన నుండి తాను తప్పించుకోగానే డీజీపీ మంత్రులు, చంద్రబాబు చేసిన ఆరోపణలే తన అనుమానాలకు సాక్ష్యాలు అని జగన్ ఆ లేఖ ద్వారా స్ప‌ష్టం చేశారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంబంధంలేని సంస్థ‌తో దర్యాప్తు చేస్తేనే టీడీపీ కుట్ర‌లు బ‌య‌ట‌ప‌డుతాయని జ‌గ‌న్ లేఖ ద్వారా కోరార‌ని స‌మాచారం. మ‌రి జ‌గ‌న్ లేఖ పై కేంద్ర నుండి ఎలాంటి రియాక్ష‌ణ్ వ‌స్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments